పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా లేకుంటే..

ఆంధ్రజ్యోతి(17-02-14): బుడి బుడి నడకలతో, చిట్టి పొట్టి మాటలతో, కేరింతలతో  ఇల్లంతా సందడి చేయాల్సిన పిల్లలు అందరికీ దూరంగా, ఒంటరితనాన్ని కోరుకుంటుంటే వారి తల్లిదండ్రుల్లో కలిగే ఆందోళన చెప్పనలవి కాదు. ఆరోగ్యంగా జన్మించాడనుకున్న శిశువు మెదడు ఎదుగుదలలో లోపం ఉందని తెలిస్తే వారి బాధ వర్ణణాతీతం. చిన్న పిల్లల్లో కనిపించే ఈ సమస్యను ‘ఆటిజమ్‌’గా పిలుస్తుంటారు. ఈ వ్యాధికి చికిత్స లేదని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే హోమియో చికిత్స అందిస్తే వారూ ఆరోగ్యవంతమైన జీవనం గడిపేలా చేయవచ్చని అంటున్నారు డాక్టర్‌ రవికిరణ్‌.
 ఆటిజమ్‌ అనేది పిల్లల్లో మానసిక ఎదుగుదలలో వచ్చే సమస్య. పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతుంటే, నడక ఆలస్యమైతే తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఆటిజమ్‌ ఉన్న పిల్లలు మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూడకపోవడం, సామాజిక సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఏర్పరచుకోలేకపోవడం, భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం, అసాధారణమైన చేష్టలు, ప్రవర్తనను కలిగి ఉంటారు. వినికిడి సమస్యతో బాధపడే పిల్లలకు కూడా మాటలు సరిగ్గా రావు.
ఎలా గుర్తించాలి? 
ఆటిజమ్‌ అనేది స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ . ఇందులో చాలా రకాలుంటాయి. లక్షణాల తీవ్రతను బట్టి ఆటిజమ్‌ను గుర్తించడం జరుగుతుంది. తెలివితేటలు సాధారణంగా ఉండి భావవ్యక్తీకరణ, భావాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు తీవ్రంగా లేకుంటే యాస్పర్జర్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇది మైల్డ్‌వెరైటీ కిందకు వస్తుంది. పిల్లలు స్నేహితులను చేసుకోలేకపోవడం, ఎదుటి వ్యక్తి భావాలను అర్థం చేసుకోలేకపోవడం, నలుగురిలో కలవకపోవడం, ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం, అడిగిన ప్రశ్నను పదేపదే తిరిగి ఉచ్చరించడం చేస్తూ ఉంటారు. దీన్ని ఇకోలేలియా అంటారు. ఏదైనా అవసరం ఉంటే వ్యాఖ్యలను కాకుండా చిన్న చిన్న పదాలతో చెప్పడం చేస్తుంటారు. ఈ పిల్లలు కొత్తదనానికి తొందరగా అలవాటుపడలేరు. ఏదైనా రొటీన్‌గా ఉండటమే ఇష్టపడతారు. ఒకేరకమైన ఆహారాన్ని, ఆట వస్తువులను కోరుకోవడం, ఒకే రంగు దుస్తులను వేసుకోవడం, టీవీలో ఒకే రకమైన కార్యక్రమాలను చూడటం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలతో ఆటిజమ్‌ను సులభంగా గుర్తించవచ్చు.
ఏడిహెచ్‌డి సమస్య
ఈ అటెన్షన్‌ డెఫిసిటి హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌ (ఏడిహెచ్‌డి) సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఏ పనీ చేయలేరు. ఏకాగ్రత ఉండదు. ఒక పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసి మరో పని ప్రారంభిస్తారు. స్థిరంగా ఉండలేరు. ఇందులో మూడు రకాలుంటాయి. 
ఇన్‌అటెన్టివ్‌ ఏడిహెచ్‌డి : వీరిలో ఏకాగ్రత లోపిస్తుంది. చెప్పింది వింటున్నట్లుగానే అనిపిస్తుంది. కానీ చెప్పిన పనిచేయరు. పని చెబితే బోర్‌గా ఫీలవుతారు. గేమ్స్‌ ఆడటం, టీవీ చూడటం బాగానే చేస్తుంటారు. 
హైపర్‌యాక్టివ్‌ ఏడిహెచ్‌డి : ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అయితే ఒక పని నుంచి ఇంకో పనికి వెళ్లిపోతుంటారు. ఏ పనీ పూర్తి చేయలేరు
కంపల్సివ్‌ ఏడిహెచ్‌డి : కంట్రోల్‌లో ఉండరు, అరుస్తూ ఉంటారు. 
ముఖ్య కారణాలు
ఆటిజమ్‌ జన్యు సంబంధమైన వ్యాధి. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్నవారిలో క్రోమోజోమ్‌ 13లో ఉండే మార్పు ఒకరకంగా ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో తల్లికి రుబెల్లా, సైటో మెగాలోవైరస్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చినా మద్యపానం, ధూమపానం చేసినా, దీర్ఘకాలిక సమస్యలు అంటే డయాబెటిస్‌, థైరాయిడ్‌, సమస్యలతో బాధపడుతూ సరైన చికిత్స తీసుకోకున్నా ఆటిజమ్‌ వచ్చే అవకాశం ఉంది. పోషక పదారా ్థలు లోపించినా, జంక్‌ఫుడ్‌, ప్రిజర్వేటివ్‌ ఫుడ్‌, ఫుడ్‌ కలర్‌ ఉపయోగించిన పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉంది. సరిగ్గా భద్రపరచని వ్యాక్సిన్‌లు తీసుకున్నప్పుడు, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు వాడే మందుల వల్ల కూడా ఆటిజమ్‌ వస్తుంది. మెంటల్లీ రిటార్టెడ్‌, ఏడిహెచ్‌ డి, రైట్‌ సిండ్రోమ్‌, ఫిట్స్‌ వంటి వ్యాధులతో కూడా వస్తుంది. 
హోమియో చికిత్స 
రోగి శారీరక, మానసిక, వ్యక్తిగత, వ్యాధి లక్షణాలు, మూలకారణాల ఆధారంగా హోమియో చికిత్స అందించడం జరుగుతుంది. హోమియో మందులు జన్యువులపై ప్రభావం చూపిస్తాయి. రోగి వ్యాధి నిరోధక వ్యవస్థను బలపరచడంలో హోమియో మందులు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రత, కాలాన్ని బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు జీవితం ఆనందంగా గడపటానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఆహార నియమాలను పాటిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించవచ్చు. 
 
డాక్టర్‌ రవికిరణ్‌, ఎండీ(హోమియో)
డైరెక్టర్‌ అండ్‌ సీనియర్‌ ఫిజీషియన్‌
మాస్టర్స్‌ హోమియోపతి
అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌
హైదరాబాద్‌, విజయవాడ, కరీంనగర్‌
ఫోన్‌ : 7842 106 106
9032 106 106