11-08-2019: ఎక్కడైనా చిన్న పాపాయి కనబడగానే.. ‘ఎంత ముద్దొస్తోందో’ అంటూ వెంటనే ముద్దు పెట్టేస్తారు చాలామంది. కానీ, అది చిన్నారికి ఏమాత్రం క్షేమకరం కాదంటున్నారు అమెరికాలోని పిల్లలు వైద్యనిపుణులు కరిన్ నీల్సన్. పెదవులపై చిన్నచిన్న పుండ్లు రావడానికి కాణమయ్యే హెచ్ఎ్సవీ-1 వంటి వైర్‌సలు చుంబనం ద్వారా పెద్దల నుంచి పిల్లలకు చేరుతాయని చెప్పారు. దీనివల్ల చిన్నారులకు దద్దుర్లు, పుండ్లు, జ్వరం వస్తాయన్నారు. వెంటనే చికిత్స అందించకపోతే.. శిశువు చూపు కోల్పోవడమే కాక కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినొచ్చని హెచ్చరించారు.