టైఫాయిడ్‌ను నిరోధిస్తే పిత్తాశయ కేన్సర్‌ నివారణ

టైఫాయిడ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తే భారత్‌, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో పిత్తాశయ కేన్సర్‌ (గాల్‌బ్లాడర్‌) ముప్పును గణనీయంగా తగ్గించొచ్చని నెదర్లాండ్స్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు చెప్పారు. టైఫాయిడ్‌ జ్వరం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న భారత్‌, పాక్‌లలోనే ఈ రకం కేన్సర్‌ విజృంభిస్తోందని చెప్పారు. గుర్తింపు కొంచెం కష్టమైన ఈ కేన్సర్‌కు ప్రజా జీవన విధానంలో మార్పులతోనే చెక్‌ పెట్టొచ్చని వివరించారు. ఇప్పటిదాకా కేవలం వైర్‌సలే కేన్సర్‌ కారకాలుగా భావిస్తూ.. బ్యాక్టీరియాలను నిర్లక్ష్యం చేస్తున్నామని వివరించారు. కాబట్టి టైఫాయిడ్‌కు కారణమయ్యే సాల్మొనెల్లా టైఫీని అంతం చేస్తే పిత్తాశయ కేన్సర్‌ను అంత తేలికగా కట్టడి చేయవచ్చంటున్నారు.