టొమాటో ఎంతో మంచిది

రోజూ టొమాటో తింటున్నారా? ఎందుకంటారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిదట. ముఖ్యంగా ఇందులో ప్రొస్టేట్‌ కేన్సర్‌పై పోరాటం చేసే శక్తివంతమైన కాంపొనెంట్‌ ఉందిట. ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయి్‌సకు చెందిన అధ్యయనకారులు చేశారు. టొమాటోల్లో లైకోపిన్‌ అనే బయోయాక్టివ్‌ రెడ్‌ పిగ్‌మెంట్‌ ఉంటుంది. ఇది రకరకాల జంతువుల్లో ప్రొస్టేట్‌ ట్యూమర్లు పెరగకుండా అడ్డుకున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. మానవశరీరంలో లైకోపిన్‌ జీవక్రియ ఎలా ఉంటుందో కనిపెట్టలేదు.

అందుకే మనుషుల్లో దీని జీవక్రియ గుర్తించడానికి అధ్యయనకారులు పూనుకున్నారు. జీవక్రియలో లైకోపిన్‌ రసాయనికంగా పలు మార్పులకు గురవడమే కాకుండా ఆరోగ్యం మీద కూడా మంచి ప్రభావం చూపుతుంది.  లైకోపిన్‌ ఎంత వేగంగా శరీరంలోకి ఇంకుతుందో అంత వేగంగా బయటకు కూడా పోతుంది. లైకోపిన్‌ శరీరంలోకి గ్రహించబడిన తర్వాత నిర్మాణాత్మకంగా మార్పులు సంభవిస్తాయి. లైకోపిన్‌ ప్రొస్టేట్‌ కేన్సర్‌ రిస్కు, తీవ్రతలను మనుషుల్లో ఎంత మేర తగ్గిస్తాయన్నది ముందు ముందు అధ్యయనకారుల పరిశోధనల్లో మరింత విస్పష్టంగా తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.