కేన్సర్‌ బాధలకు విరుగుడు!

05-08-2019: మూడు, నాలుగో దశ కేన్సర్లకు ఇచ్చే కీమోథెరపీ చికిత్సలో పలు రకాల దుష్ప్రభావాలను రోగులు భరించక తప్పదు. రోగులు ఆ బాధలు భరిస్తూ చికిత్సను కొనసాగించలేరు, అలాగని చికిత్సను ఆపేసి వ్యాధినీ జయించలేరు. ఈ చిత్రమైన వ్యధ నుంచి ఉపశమనం పొందే వీలు ఆయుర్వేదంలో ఉంది.
 
ఆయర్వేదంలో మరీ ముఖ్యంగా కేన్సర్‌ రోగుల కోసం ‘కీమోథెరపీ అండ్‌ రేడియేషన్‌ కిట్‌’ అందుబాటులో ఉంది. కేన్సర్‌ చికిత్సలు తీసుకుంటూనే, వాటి దుష్ప్రభావాలను తగ్గించుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం కిట్‌ ఉపయోగిస్తూనే కొన్ని ఆహార, జీవనశైలి నియమాలనూ అనుసరించాలి. అవేంటంటే...
అసిడిటీ తగ్గించుకోవడం కోసం పెరుగు, నిల్వ పచ్చళ్లు, చింతపండు లాంటి పుల్లటి పదార్థాలను ఆహారంలో తగ్గించాలి.
అల్లం, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి.
ఉసిరి అసిడిటీని తగ్గిస్తుంది. కాబట్టి 5 నుంచి 10 మి.లీ తాజా ఉసిరి రసం ప్రతి రోజూ తీసుకోవాలి.
కాళ్ల వాపు తగ్గడం కోసం గోరువెచ్చని నీటిలో సైంధవ లవణం కలిపి, అందులో కాళ్లు కొద్దిసేపు ఉంచాలి.
పిత్త దోషాన్ని సరి చేయడం కోసం నిర్దిష్టమైన ఆహార నియమాలు పాటించాలి. కీమోథెరపీ వల్ల తలెత్తే దుష్ప్రభావాలను ఆయుర్వేద వైద్యంతో సరి చేయడం ద్వారా కేన్సర్‌ చికిత్స తాలూకు ఇబ్బందులను తేలికగా అధిగమించవచ్చు.
 
-డాక్టర్‌ అదితీ కులకర్ణి
కేన్సర్‌ స్పెషలిస్ట్‌, హైదరాబాద్‌