కేన్సర్‌ నుంచి అప్రమత్తతే రక్షణ!

04-02-2019: కేన్సర్‌ వ్యాధి పట్ల సర్వత్రా భయం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఆ వ్యాధి గురించిన అవగాహన లేకపోవడమే! కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోగలిగితే కేన్సర్‌ నుంచి రక్షణ పొందడం అసాధ్యమేమీ కాదు.
 
అపోహలు వీడండి: వ్యాధి ముదరక ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే కేన్సర్‌ నుంచి విముక్తి పొందడం తేలికే! కేన్సర్‌ మరణాల్లో 30% మరణాలను వ్యాధిని తొలి దశలోనే గుర్తించగలిగితే నియంత్రించవచ్చు.
 
నివారణ సులువే!
సిరి ధాన్యాల్లో పోషకాలు, ఔషధ గుణాలు అధికం. కాబట్టి వీటిని ఆహారంలో అధికంగా వాడాలి. మాంసాహారం, ఉప్పు కలిగిన ఆహారం, ప్రాసె్‌సడ్‌ ఫుడ్‌లలో కేన్సర్‌ కారకాలు ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అలాగే పొగాకులో 80 రకాల కేన్సర్‌ కారకాలు ఉంటాయి. కాబట్టి పొగాకుకు దూరంగా ఉండాలి. రసాయన పదార్థాల పరిశ్రమలు, రంగుల పరిశ్రమలు, ఎక్స్‌రే రేడియేషన్‌లకు దూరంగా ఉండాలి. హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్‌ వల్ల కాలేయ కేన్సర్‌ వచ్చే వీలుంది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌, హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వల్ల వస్తుంది. కాబట్టి వీటి నుంచి రక్షణ కోసం సంబంధిత టీకాలు తీసుకోవాలి.
 
-డాక్టర్‌ జి.సురేంద్ర బాబు
అమృత చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, సిరిసిల్ల.