‘వీర్యం’తో కేన్సర్‌కు చెక్‌

బెర్లిన్‌, డిసెంబరు 24: గర్భాశయ ముఖద్వార(సర్వైకల్‌) కేన్సర్‌ను కట్టడి చేసేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి మందులకు లొంగదు. కేన్సర్‌ కణాలపై ప్రభావం చూపకుండా శరీరంలోని ఆమ్లాల్లోకి మందు దారి మళ్లుతుంది. అది లక్ష్యానికి చేరుకోవాలంటే శరీరంలోని అయస్కాంత వ్యవస్థ సహకరించాలి.
 
ఇది జరగడం లేదని గుర్తించిన పరిశోధకులు ఆ శక్తి ‘వీర్యానికి’ ఉందని గుర్తించారు. పశు వీర్యాన్ని డోక్సోరుబిసిన్‌ అనే కేన్సర్‌ మందుతో కలిపి పరిశోధన చేయగా... అన్ని ఆటంకాలను అధిగమించి ఆశించిన ఫలితాలు వచ్చాయని జర్మనీలోని డ్రెస్‌డెన్‌కు చెందిన లిబింజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సోలిడ్‌ స్టేట్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ అనే సంస్థ తెలియజేసింది. ఈ విధానం ద్వారా 80 శాతం వరకూ రోగం దారికొచ్చిందని పరిశోధకులు తెలిపారు.