కార్బొహైడ్రేట్లతో కేన్సర్‌ తిరగబెట్టే ముప్పు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 15: కేన్సర్‌ చికిత్సకు ముందు కార్బొహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఆ వ్యాధి తిరగబెట్టే అవకాశం ఎక్కువంటున్నారు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు. ఒక్కోసారి ఇది మరణానికీ దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు. కేన్సర్‌ చికిత్స తర్వాత తృణధాన్యాలు, బంగాళదుంపలు, చిక్కుళ్లు వంటి పదార్థాలు సత్ఫలితాలనిస్తాయన్నారు.