కేన్సర్లకు దూరంగా...

13-07-2018:ఈమధ్యకాలంలో మహిళల గర్భధారణకు సంబంధించిన కేన్సర్లపై వాట్సాప్‌లలో చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. అందర్నీ అవి బాగా భయపెడుతున్నాయి. అందుకే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం...

కేన్సర్‌ రావడానికి పలు కారణాలుంటాయి. కేవలం ఒక్క కారణం వల్ల వచ్చిందనో లేక కర్మానుసారంగా వచ్చిందనో అనుకోవడం తప్పు.
గర్భధారణకు సంబంధించిన వ్యవస్థ బాగుండాలంటే...
సమతుల ఆహారంతో పాటు ఎక్కువగా ఎరుపు, నారింజ, పచ్చ రంగులో ఉండే ఆహారపదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి.
విరోచనం సాఫీగా జరిగేట్టు చూసుకోవాలి. దీనికోసం తగినంత పీచుపదార్థం, తగినంత నీరు ఆహారంలో ఉండాలి.
మూత్ర విసర్జనను ఆపుకోవడం, లేదా బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు నీరు తాగకుండా ఉండటం మంచిది కాదు.
పొట్ట చుట్టూ అతిగా కొవ్వు పెరగకుండా, శరీర బరువు పెరగకుండా తగినంత వ్యాయామం చేయాలి.
పీరియడ్స్‌ క్రమం తప్పకుండా సరి చేసుకోవాలి. లైఫ్‌స్టయిల్‌ మారడం వల్ల, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది.
మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు క్రమం తప్పకుండా గైనిక్‌ పరీక్షలు చేయించుకోవాలి.
పొగత్రాగటం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
హెచ్‌పివీ వ్యాక్సిన్‌ చేయించుకోవాలి.

వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యమైనది.

వీటిని రోజువారీ ఆహారంలో జత చేయండి

టొమాటో సూప్‌ లేదా రసం లేదా జ్యూసు
ద్రాక్ష, దానిమ్మ, పుచ్చకాయ, నారింజ జ్యూసు లేదా పళ్లు.
క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌తో కలిపి ఎర్ర పప్పు సూప్‌
ఉల్లిపాయలు, వెల్లుల్లి సలాడ్‌ లేదా చట్నీ
ఆకుకూరల సూప్‌ లేదా ఆకుకూర పప్పు.
  
డాక్టర్‌ బి. జానకి
న్యూట్రిషనిస్ట్‌