జీకా వైర్‌సతో మెదడు కేన్సర్‌ చికిత్స

07-09-2017: విషానికి విషమే విరుగుడు! ఇదే సూత్రంతో పెన్సిలిన్‌ ఇంజక్షన్‌ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే బాటలో అతి భయంకరమైన మెదడు కేన్సర్‌కు చికిత్సను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. గర్భస్థ శిశువు మెదడును ఎదగనీయకుండా చేసే జీకా వైర్‌సను ఉపయోగించి మెదడు కేన్సర్‌ కణాలను తుదముట్టించేందుకు బాటలు వేస్తున్నారు. పిండదశలోనే శిశువు మెదడులోని కణాలను చంపే వైరస్‌ శక్తిని గ్లియోబ్లాస్టోమా రకం మెదడు కేన్సర్‌ కణాలపైకి మళ్లించవచ్చని తేలింది. గ్లియోబ్లాస్టోమా కేన్సర్‌పై ప్రస్తుతం ఉన్న చికిత్స పద్ధతులకు జీకా వైర్‌సను జోడించడం ద్వారా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని ప్రొఫెసర్‌ మైకెట్‌ ఎస్‌ డైమండ్‌ తెలిపారు.