వీటితో మెదడుకెంత బలమో

10-04-2018: సాధారణనంగా పోషకాల వల్ల కలిగే ప్రయోజనాలు వేరు వేరుగా ఉంటాయి. ప్రత్యేకించి, కండరాలు, ఎముకలు ఇంకా ఇతర శరీర భాగాలకు శక్తినిచ్చేవి వేరుగా. మెదడును శక్తినిచ్చేవి వేరుగా ఉంటాయి. కానీ, సూక్ష్మపోషకాల (మైక్రో న్యూట్రియెంట్స్‌) తీరు వేరు. ఇవి శరీరంతో పాటు మెదడును బలోపేతం చేయడంలోనూ అంతే భాగా పనిచేస్తాయి. అయితే ఏ సూక్ష్మపోషకం ఎలా పనిచేస్తుందో అమెరికాలోని నేష్నల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వారు ఇటీవల ప్రచురించిన ఒక మెడికల్‌ జర్నల్‌లో పేర్కొన్నారు. ఇంతకీ ఆ పోషకాలు ఏమిటంటారా?

 
విటమిన్‌ బి-1: కార్య నిర్వాహణలో అవసరమయ్యే అవగాహనా సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. ప్రత్యేకించి పెద్దవారికి దీని వల్ల కలిగే ప్రయోజనం చాలా ఎక్కువ.   
 
విటమిన్‌ బి-జి: వృద్ధుల మెదడులో వచ్చే పరిణ తి, జ్ఞాపకశక్తికి సంబంధించిన విషయాల్లో ఒక నిలకడ ఏర్పడేలా చేస్తాయి.
 
విటమిన్‌ బి-6: బహిష్టుకు ముందు కొంత మంది స్త్రీలలో వచ్చే డిప్రెషన్‌ను నిరోధిస్తుంది.
 
విటమిన్‌ 12: మతిమరుపు (డిమెన్షియా)తో పాటు, రక్తసంబంధమైన కొన్ని దుష్పరిణామాలు తలెత్తే వేగాన్ని తగ్గిస్తుంది.
 
విటమిన్‌- సి: నరాల చివరల పటుత్వాన్ని పెంచుతుంది.
 
విటమిన్‌ -డి: నరాలను క్షీణింపచేసే పలు వ్యాధులను నివారిస్తుంది.
 
విటమిన్‌ ఇ: నరాల లోపలి పొరను కాపాడుతుంది.
 
ఐరన్‌: ఆక్సీజన్‌ సాఫీగా అందేలా చేసి మెదడు శక్తిని పెంచుతుంది.
 
మెగ్నీషియం: ప్రధాన జీవక్రియలు సజావుగా జరిగేలా చేస్తుంది.
 
జింక్‌: రుచిని గ్రహించే శక్తిని పెంచుతుంది.
  
కాపర్‌: అల్జీమర్‌ వ్యాధి రాకుండా చే యడంలో తోడ్పడుతుంది.
 
అయోడిన్‌: మెదడు క ణాల్లో జరిగే జీవక్రియల శక్తిని పెంచుతుంది.