వేరుశనగతో జ్ఞాపకశక్తి

27-12-2017: టైంపాస్‌ కోసం తినే వేరుశనగతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. వీటిల్లో ఉండే విటమిన్‌ బి–3 పోషకం మెదడుని చురుకుగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని వారు చెబుతున్నారు. మన మూడ్‌ బాగుండడానికి సెరటోనిన్‌ అనే రసాయనం కారణం అన్న సంగతి తెలిసిందే! వేరుశనగలోని అమినోయాసిడ్స్ ఈ రసాయనం విడుదల కావడానికి దోహద పడతాయి. దాంతో మన మానసిక స్థితి బాగుండడంతో పాటు డిప్రెషన్‌ వంటి వాటి బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు అన్నది నిపుణుల వాదన. బాగా ఒత్తిడికి లోనయిన సందర్భలోనూ, డిప్రెషన్‌కి గురైనప్పుడు గుప్పెడు వేరుశనగ పప్పు తింటే వాటి నుంచి త్వరితగతిన బయటపడవచ్చు అని వారు చెబుతున్నారు.