ఏరోబిక్స్‌తో మెదడు పనితీరు మెరుగు

15-11-2017: ఏరోబిక్స్‌ చేసేవారిలో మెదడు పనితీరు, దాని ఆరోగ్యం మెరుగుపడుతాయని తాజా అధ్యయనంలో వెల్లడయింది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తితో సంబంధమున్న మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంపై ఏరోబిక్స్‌ ప్రభావాన్ని ఆస్న్టేలియాలోని పశ్చిమ సిడ్నీ వర్సిటీ ప్రొఫెసర్లు అధ్యయనం చేసి వయసు పెరుగుతున్న కొలది మెదడు ఆరోగ్యం క్షీణిస్తుందని, అదే థ్రెడ్‌మిల్‌ రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌ వంటి వివిధ రకాల వ్యాయామాలు చేస్తే మెదడు పనితీరు మెరుగైనట్లు తేల్చారు.