శరీరంపై మెదడుదే పైచేయి!

25-10-2017: మెదడును ఉపయోగించి కొన్ని పనులు చేస్తాం, శారీరక బలాన్ని ఉపయోగించి కొన్ని పనులు చేస్తాం. కానీ ఒకేసారి రెండింటినీ ఉపయోగించి పని చేయాల్సి వస్తే? ఏ పని త్వరగా చేయగలం? ఇదే విషయాన్ని కనుగొనడానికి కేంబ్రిడ్జి వర్సి టీ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా మెదడును, శారీరక బలాన్ని ఏకకాలంలో ఉపయోగించి 62 మంది యువకుల చేత మూడు నిమిషాలపాటు వేర్వేరు పనులు చేయించారు. వీరందరికీ కొన్ని పదాలు చెప్పి గుర్తుపెట్టుకోమన్నారు. ఆ తర్వాత వీరిచేత మూడు నిమిషాలపాటు బోట్‌ రైడింగ్‌ చేయించారు. ఆ తర్వాత ఈ పదాలు చెప్పే సమయంలో వీరి రైడింగ్‌ వేగం తగ్గింది. తద్వారా.. శారీరక సామర్థ్యంపై మానసిక సామర్థ్యానిదే పైచేయి అని గుర్తించారు.