సైలెంట్‌ కిల్లర్‌.. బ్రెయిన్ ట్యూమర్‌

ఏటేటా పెరుగుతున్న కేసులు
సకాలంలో గుర్తించకపోతే ముప్పే
హైదరాబాద్‌, 06-06-2018: బ్రెయిన్‌ ట్యూమర్‌ సైలెంట్‌ కిల్లర్‌గా మారు తోంది. ఏటా కొత్తగా 10 వేల మంది ఈ బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడుతున్నారని వై ద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు ప్రాణాలు తీసే వరకూ బయటపడడం లేదని, బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చిన వాళ్ళలో 3వ వంతు మం ది ఐదేళ్లలోపే మరణిస్తున్నారని వైద్యులం టున్నారు. అవగాహన లోపం వల్ల మెదడు లోని కణతులను ప్రారంభ దశలో గుర్తించ లేకపోతున్నారు. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల లోపు వారే ఈ వ్యాధి బారిన పడుతు న్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
 
మెదడు పనితీరు మందగిస్తుంది...
మెదడులో సాధారణంగా పాత కణజాలా లు పోయి కొత్త కణజాలాల సృష్టి నిరంతరం గా జరుగుతుంది. ఈ ప్రక్రియలో పాత కణ జాలాలు పూర్తిగా పోకుండా మిగిలిపోతే బ్రె యిన్‌ ట్యూమర్‌ (మెదడు కంతులు) వచ్చే అవకాశముం ది. ఈ వ్యాధి రావడానికి రేడియేషన్‌ కూడా కారణమని వైద్యులు చెబుతున్నారు.
 
బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్షణాలు...
తుళ్లిపడడం, అకస్మాత్తుగా కింద పడడం, చేతిలో నుంచి వస్తువులు జారి పడడం బ్రెయిన్‌ ట్యూమర్‌ లక్ష ణాలు. అయితే.. దీనిని చాలా మంది పసిగట్టలేరు. తమ కు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉందని తెలుసుకోలేరని, తెలుసు కునే సరికి పరిస్థితి విషమిస్తుందని వైద్యులు తెలిపారు. తలనొప్పి, వాంతి కాగానే తలనొప్పి తగ్గితే మెదడులో కణతులున్నాయని గుర్తించాలి.
 
ఇలా మార్పులు కనిపిస్తే...
పద్దెనిమిదేళ్ల వయస్సు దాటిన వారిలో వచ్చే ఫిట్స్‌ ఎక్కువగా కణతులకు సంబంధించినవే ఉంటున్నాయి. మాట్లాడడంలో ఇబ్బందులు, శరీర భాగాల్లో కొన్ని చోట్ల చచ్చుబడిపోవడం, నిటారుగా నిలబడలేకపోవడం, చూ పులో మార్పులు, అయోమయానికి గురికావడం, వినికిడి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మింగడంలో ఇబ్బందులు వంటి లక్షణా లు కనిపిస్తే మెదడులో కణతులు కణ తులు వచ్చినట్లు అనుమానించొచ్చు. శరీరంలో ఒక భాగం, ప్రాంతం మొద్దు బారినట్లు, ముఖం కండరాలు పక్కకు లాగినట్లు, ఒక భాగంలో తిమ్మిర్లు ఉ న్నట్లు (స్పర్శలో తేడా) ఉండడం, వ ణుకుడు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రందించి చికిత్స లు తీసుకోవాలి. మూడు గంటల్లోగా చికిత్సలు తీసుకుంటే ప్రమాదం బారి నుంచి బయట పడొచ్చు.
 
120 రకాల ట్యూమర్లు ఉన్నాయి...
బ్రైయిన్‌ ట్యూమర్లు దాదాపు 120 రకాలు ఉంటాయి. అన్ని రకాల ట్యూ మర్లు రోగికి హాని కలిగించేవే. అయి తే.. వాటిని ముందుగా పసిగట్టి చికి త్స చేయించుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశముంది. మ్యాలిగ్నెంట్‌ ట్యూమర్‌ కూడా ప్రమాదకరమే. ట్యూమర్లను ముందు గా గుర్తిస్తే తొలగించడానికి వీలుంది.
- డాక్టర్‌ శ్రీనివాస్‌ జూలూరి, సర్జికల్‌ అంకాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి