వ్యాయామం ఎక్కువైతే మెదడుకు చేటు

29-10-2017: చెమటలు కక్కేలా వ్యాయామం చేస్తున్నారా? తగ్గిస్తే మేలు. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహంతో బాధపడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలట. తీవ్రస్థాయి వ్యాయామం ఏకధాటిగా రెండు వారాల పాటు చేయటం వల్ల మెదడు గ్లూకోజ్‌ జీవక్రియలో మార్పు జరుగుతుందని, దాంతో మెదడు ప్రమాదంలో పడుతుందని ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టుర్కు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.