తీవ్ర వ్యాయామంతో మెదడు చురుకు

24-11-2017: రోజుకు 20 నిమిషాల పాటు తీవ్ర వ్యాయామం చేస్తే మెదడు చురుగ్గా తయారవుతుందని కెనడాలోని మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. చిత్తవైకల్యం, అల్జీమర్స్‌తో బాధపడేవాళ్లు ఎక్కువగా శ్రమిస్తే మంచి ఫలితం ఉంటుందని సూచించారు. కొంతమందిని ఆరువారాల పాటు కొంత సమయం తీవ్ర వ్యాయామం చేయించి చూడగా వారి జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనబడినట్లు వెల్లడించారు.