ఈ పనులతో సూపర్ యాక్టివ్..

21-10-2017: ఏ పని సక్రమంగా చేయాలన్నాచురుకుదనం అత్యవసరం. యాక్టివ్‌నెస్ పెంపొందడం కోసం వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మెదడును ఖాళీగా ఉంచకుండా ఎప్పటికప్పుడు కొత్త పనులను అప్పగిస్తూ ఉండాలి. కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త అంశాల గురించి తెలుసుకోవడంతో పాటు పజిల్స్‌ మెదడు పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. అదేవిధంగా వ్యాయామం వల్ల అల్జీమర్స్‌ తదితర జ్ఞాపక శక్తి సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. అలాగే సామాజిక అనుబంధాలు పెంచుకోవడంతో కూడా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. నిద్రలేమి, ఒత్తిడికి గురికావడం మొదలైనవి మానసిక సామర్థ్యాలను దెబ్బతీస్తాయి. అందుకే తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు, ఆలివ్‌ ఆయిల్, ప్రొటీన్లు ఉండే ఆహారం మొదలైనవి మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి.