మెదడులోనే అంతా!

10-04-2018: ఆత్మహత్యకు పాల్పడిన న్యూస్‌ రీడర్‌ సూయిసైడ్‌ నోట్‌లో రాధికా రెడ్డి ‘నా మెదడే నా శత్రువు’ అని రాసింది. ఆ మాటలకు అర్థం ఏంటంటే... ప్రతి ఆలోచనా మెదడులోనే పుడుతుంది. జీవితాన్ని సరిదిద్దుకోవాలన్నా, అంతం చేసుకోవాలన్నా అందుకు కావలసిన ఆలోచన మెదడులోనే పుట్టాలి. కానీ బలహీన మనస్తత్వం కలిగి ఉండీ డిప్రెషన్‌కు గురైన వాళ్ల మెదడు తనను చుట్టుముట్టిన సమస్య గురించే ఆలోచిస్తుందిగానీ, ఆ పరిధి దాటి... సమస్యకు కారణం, మూలం, దాన్ని తొలగించుకునే లౌక్యం మీదకు ఆలోచనలు వెళ్లవు. దాంతో సమస్య చుట్టూరానే ఆలోచనలు తిరుగుతూ డిప్రెషన్‌ను మరింత తీవ్రం చేస్తాయి. ఇలాంటి స్థితిలో ‘మెదడే శత్రువు’ అని అనిపించడం సహజమే! అయితే ఆ శత్రువునే చికిత్సతో మిత్రుడిగా మలుచుకునే వీలుందని గ్రహిస్తే విలువైన ప్రాణాలు నిలుస్తాయి.