తక్కువ నిద్రపోయే మహిళల్లో రక్తపోటు

వాషింగ్టన్‌, జూన్‌ 27: తక్కువగా నిద్రపోయే మహిళల్లో రక్తపోటు ఇబ్బందులు వస్తాయని తాజా అధ్యయనంలో తేల్చారు. రక్తపోటే కాకుండా హృద్రోగ సమస్యలు కూడా వస్తాయని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం వారు 323 మంది మహిళలపై పరిశోధన చేశారు. తగినంత నిద్ర లేకపోవడం, నిద్రలేమితో బాధపడటం వంటి లక్షణాలున్న వారిలో రక్తపోటుకు దారితీస్తే అంశాలను గుర్తించారు.