లింగన్‌బెర్రీ జ్యూస్‌తో బీపీకి కళ్లెం

లండన్‌, జనవరి 5 : మీరు చిత్రంలో చూస్తున్నవి లింగన్‌ బెర్రీ పండ్లు. దీర్ఘకాలం పాటు వీటి జ్యూస్‌ను తాగితే రక్తపోటు(బీపీ) అదుపులోకి వస్తుందని ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే పాలీఫినోల్స్‌ రసాయనాలకు హృద్రోగాలు, బీపీకి కళ్లెం వేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. శరీరంలో బీపీ నియంత్రణకు రెనిన్‌ యాంజియోటెన్సిన్‌ హార్మోన్‌ వ్యవస్థ ఆయువు పట్టులాంటిది. దానిపై పాలీఫినోల్స్‌లు చూపే ప్రభావం కారణంగా రక్తపోటు అదుపులోకి వస్తుందని ఎలుకలపై జరిపిన ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది.