రక్తపోటు తగ్గించే ఇంటి చిట్కాలు

ఆంధ్రజ్యోతి, 09-04-2015: ప్రస్తుతమున్న ఉరికే ప్రపంచంలో ఎక్కువమంది హై బీపీ లేదా హైపర్‌టెన్షన్‌ పీడితులే. అధిక రక్తపోటు వల్ల గుండె, మెదడు సమస్యలు అతి త్వరగా అటాక్‌ అవుతాయి. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కూల్‌గా ఉండటమే కాదు ప్రతీ రోజూ తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. హైబీపీని తగ్గించడానికి అందుబాటులో ఉన్న హోమ్‌రెమెడీస్‌ ఏంటో తెల్సుకుందాం.

ఉల్లిపాయ, తేనె అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒక టేబుల్‌ స్పూన్‌ ఉల్లిపాయ రసంలో, రెండు టేబుల్‌ స్పూన్ల తేనెను కలిపి రోజూ తాగాలి. ఖచ్చితంగా హైపర్‌టెన్షన్‌ తగ్గి బీపీ కంట్రోల్‌ అవుతుంది.

కరివేపాకు ఆరోగ్య ఉపకారి. ముఖ్యంగా గుండెకు చాలా మంచిది. ఒక గ్లాసు నీళ్లలో నాలుగైదు కరివేపాకుల్ని వేసి కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత తాగాలి. ఇలా రోజూ చేయటం వల్ల బ్లడ్‌ప్రెషర్‌ తగ్గుతుంది.

వెల్లుల్లి ప్రతీ రోజూ తినమని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. అంటే దీని ప్రాధాన్యతని అర్థం చేసుకోవచ్చు. రోజూ ఒక వెల్లుల్లి పీస్‌ తింటే నాచురల్‌ మెడిసిన్‌లా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లి ఒంట్లోని కొలెస్ట్రాల్‌ని తగ్గించటంతో పాటు రక్తప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది. 

క్యారెట్స్‌తో కలిపి పాలకూరని మిక్స్‌ చేసి ఆ జ్యూస్‌ చేసుకొని తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు ఈ జ్యూస్‌ తాగితే హైబీపీ తగ్గుతుంది.

ప్రతీరోజూ రెండుసార్లు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఖచ్చితంగా అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. 

చేపకూర తినటం వల్ల కూడా హై బీపీ తగ్గుతుంది.