కొబ్బరి నూనెతో హైబీపీ నియంత్రణ

24-08-2017: అధిక రక్తపోటు (హైబీపీ) బాధితులకు శుభవార్త.. కొబ్బరి నూనెతో చేసిన వంటకాలను ఆహారంగా తీసుకుంటూ నిత్యం వ్యాయామం చేస్తే హైబీపీ నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ మేరకు బ్రెజిల్‌లోని పారైబా యూనివర్సిటీ పరిశోధకులు ఐదు వారాల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించి ఈ విషయాన్ని ధృవీకరించారు. కొబ్బరి నూనె బారో రిఫ్లెక్స్‌ సెన్సివిటీని పునరుద్ధరించడంతోపాటు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్‌ వాల్డిర్‌ డి అండ్రాడే తెలిపారు. కొబ్బరి నూనె, వ్యాయామం రెండింటి కలయికతోనే ఇది సాధ్యపడిందని వాల్డిర్‌ వివరించారు.