చిందే మంచి మందు!

02-11-2017: ఇష్టమైన సంగీతం లేదా పాట విన్న సమయంలో చేతులతో పాటు కాళ్ళు కూడా మనకు తెలియకుండానే కదులుతుంటాయి. ఈ ప్రక్రియ మనకు తెలియకుండా సాగినా ఇతరులు చూస్తున్నారని గ్రహించగానే కాళ్ళూ, చేతులనూ కదల్చడం ఆపేస్తాం. ఇక నుంచి అలా ఆపవద్దు అంటున్నారు పరిశోధకులు. ప్రత్యేకించి డ్యాన్సు చేయనవసరం లేదనీ, పాటకీ, లేదా సంగీతానికి అనుగుణంగా కాళ్ళూ చేతులూ కదిల్చినా, పార్కిన్సన్ లాంటి వ్యాధితో పాటు బిపీ, షుగర్‌ లాంటి మొండి జబ్బుల నుంచి బయటపడవచ్చు అంటున్నారు. కొంత మంది మీద వీరు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి మంచి సంగీతాన్ని వినిపించారు. మరొక గ్రూపు వారికి సంగీతాన్ని వినిపించలేదు. మొదటి గ్రూపు వారిని సంగీతం వింటున్నంత సేపూ కాళ్లూ చేతులూ ఆడించమన్నారు. కొన్ని నెలల అనంతరం వీరిని పరిశీలించగా, వీరిలో బిపీ, షుగర్‌ అదుపులో ఉన్న విషయాన్ని గ్రహించారు. దీనికి కారణం సంగీతానికి అనుగుణంగా కాళ్ళూ, చేతులూ కదల్చడమే అని వీరు చెబుతున్నారు.