రక్తపోటుకు ఇలా చెక్‌ చెప్పండి

21-09-2017: అధిక రక్తపోటుతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తినడం, కఠినమైన ఆహార నియమాలను పాటిస్తుంటారు. ఇలాంటి నియమాల జోలికి పోకుండా మాగ్నిషియం సప్లిమెంటును 350 మిల్లీగ్రాముల చొప్పున నెలరోజుల పాటు తీసుకుంటే రక్తపోటును తగ్గించుకోవడమే కాకుండా రక్తప్రసరణను కూడా మెరుగు పరుచుకోవచ్చు అంటున్నారు ఇండియానా యూనివర్శిటీ పరిశోధకులు. సుమారు మూడు వేల మంది మీద 34 అధ్యయనాలను నిర్వహించారు. పురుషులు 350 మిల్లీగ్రాములు, స్త్రీలు 270 మిల్లీగ్రాములు తీసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు.