ఆవకాయ తినొచ్చా?

25-05-2018: బీపీ ఉన్నవారు ఆవకాయ తినొచ్చా? ఆవకాయ పచ్చళ్లు ఆరోగ్యానికి మంచిదేనా?

 
ఆవకాయ, ఊరగాయలు నిలువ ఉండే ఆహారపదార్థాలు. సీజన్లలో దొరికే కాయలు నిలువ చేసుకొని అన్‌సీజన్‌లో వాటి రుచిని ఎంజాయ్‌ చేస్తుంటారు. భోజనంలో ఒక ముక్క ఊరగాయ ఉంటే చాలు, మొత్తం భోజనం కంప్లీట్‌ చేయవచ్చు. మరి ఇంత రుచిని ఇచ్చే ఊరగగాయ ఎంత తీసుకోవచ్చు? ఎవరైనా సరే పచ్చళ్లు మితంగానే తీసుకోవాలి. పచ్చళ్లలో ఉప్పు శాతం అధికం కాబట్టి బీపీ ఉన్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. బీపీ ఉన్నవారు రోటీ పచ్చళ్లు తీసుకోవచ్చు. అయితే వీటిలో కూడా ఉప్పు తగ్గించి తీసుకోవాలి.
 
ఇక ఊరగాయల పోషక విలువల సంగతికి వస్తే, నిల్వ పదార్థం కాబట్టి వీటిలో గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. మామిడికాయల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ సి కూడా. ఆవకాయలో ఉండే నువ్వుల నూనె, ఆవాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలు కూడా వీటి నుంచి లభిస్తాయి. ఫాట్‌ సోలబుల్‌ విటమిన్స్‌ ఎ,డి ఆవకాయలో అధికం. ఆవకాయ తినాలనుకునే వారు మితంగా తినాలి. రోజుకి ఒక టీ స్పూను ఆవకాయ సరిపోతుంది.
 
 
డాక్టర్‌ బి.జానకి
న్యూట్రిషనిస్ట్‌