22-11-2017: ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి వాడే ఔషధాలతో రక్తపోటును కూడా నివారించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం రక్తపోటుకు వాడే మందులతో రక్తహీనత, మైకం, మలబద్ధకం లాంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే కొత్త ఔషధాల తయారీకి పరిశోధనలు ప్రారంభించిన అమెరికాలోని జార్జ్‌టౌన్ వర్సిటీ పరిశోధకులు.. కొన్ని రకాల కేన్సర్ మందులు రక్తపోటును తగ్గించే గుణాలను కలిగి ఉన్నాయని గుర్తించారు. అయితే, రక్తపోటుకు ఆ ఔషధాలు తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలను కనుగొనాల్సి ఉంది. ఇదిలా ఉండగా, రక్తకేన్సర్ను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు ‘సీడీ22’ ప్రొటీన్ అణువును గుర్తించారు. ఆ అణువును లక్ష్యంగా చేసుకొని రక్తకేన్సర్ను సమర్థవంతంగా తగ్గించవచ్చని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.