వారసత్వంతోనే బీపీ మందు నిర్ణయం

రక్తపోటు (బీపీ) నియంత్రణలో వారసత్వ లక్షణాల ప్రభావం ఉంటుందా..? అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. నిజానికి మార్కెట్లో లభించే రక్తపోటు నియంత్రణ మందులు అందరికీ ఒకేలా పనిచేయవని వైద్యులు పేర్కొంటున్నారు. రోగుల శరీర తత్వాలు, వారసత్వ లక్షణాల ప్రభావం వల్ల కొందరికి బాగా పనిచేసిన మందు మరొకరికి పనిచేయకపోవచ్చని వారు వివరించారు. రక్తపోటు నియంత్రణకు మందులను సూచించే ముందు రోగి వారసత్వ లక్షణాలు పూర్వీకుల వైద్య చరిత్రను కొంత పరిశీలిస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.