రక్తపోటు పరీక్షలో...

05-07-2018: హడావిడిగా రక్తపోటు పరీక్షలు చేయించుకుంటే వచ్చే రిజల్టు చాలా సార్లు తప్పుల తడకగానే ఉంటుంది. అందువల్ల పరీక్షలకు వెళ్లినప్పుడు కొన్ని నియమాలు విధిగా పాటించాలి. వాటిల్లో ప్రధానంగా.....

రక్తపోటు పరీక్షకు వెళ్లడానికి 30 నిమిషాల ముందు నుంచి వ్యాయామం చేయడం గానీ, ఏమైనా తినడం గానీ, కాఫీ, టీ లాంటి పానీయాలు సేవించడం గానీ చేయకూడదు. మూత్రాన్ని ఆపడం కూడా చేయకూడదు.
చేతిని ఏదో ఒక సపోర్ట్‌ మీద ఉంచాలి గానీ, గాలిలోకి ఎత్తినట్లు ఉంచకూడదు.
పరీక్ష కోసం ఉంచే బల్ల మీద కాకుండా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఆ సమయంలో వెన్నును కుర్చీకి ఆనించి ఉంచాలి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు. పాదాలు పూర్తిగా నేల మీద ఆనాలి.
డాక్టర్‌ (క్లినిషియన్‌) రావడానికి 5 నిమిషాల ముందే కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఉండాలి.
భుజం మీద ఏ రకమైన బరువూ ఉండకూడదు.
రక్తపోటు పరీక్షిస్తున్న సమయంలో క్లినిషియన్‌ గానీ, ఆ వ్యక్తిగానీ మాట్లాడకూడదు.