అల్జీమర్‌కు బీపీతో చెక్‌..

04/07/15

ప్రతి చిన్న విషయానికి బీపీ పెరిగిపోతోందని బాధపడకండి. ఓ రకంగా బీపీ కూడా మేలు చేస్తుందని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. హైబీపీతో బాధపడేవారిని అల్జీమర్స్‌ అంతగా ఇబ్బంది పెట్టదని అమెరికాలోని బ్రింగ్‌హామ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. బీపీ కంట్రోల్‌ చేయడానికి తీసుకునే ఔషధాలు.. బ్లడ్‌ప్రెషర్‌తో పాటు అల్జీమర్‌ను అదుపు చేస్తుందని చెబుతున్నారు. బీపీ, అల్జీమర్‌ రెండు వ్యాధులతో బాధపడుతున్న 17,008 మంది, కేవలం అల్జీమర్‌ సమస్య ఉన్న 37,154 మంది కేస్‌ స్టడీస్‌ పరిశీలించారు. బీపీ, అల్జీమర్స్‌ రెండూ ఉన్నవారిలో అల్జీమర్స్‌ ప్రభావం తక్కువగా ఉండడాన్ని గమనించారు. అదే సమయంలో బీపీ లేకుండా కేవలం అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారిలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తానికి హైబీపీని అదుపు చేసుకోవడంలో తీసుకునే శ్రద్ధ అల్జీమర్స్‌ ఎఫెక్ట్‌నూ తగ్గిస్తోందని ఈ పరిశోధలో వెల్లడైంది.