బరువు తగ్గితే మధుమేహానికి కళ్లెం

01-10-2019: మధుమేహాన్ని(షుగర్‌) గుర్తించిన తొలి ఐదేళ్లలో 10ు శరీర బరువును తగ్గించుకోగలిగితే, దాని బారినుంచి తప్పించుకోవడం సాధ్యమేనని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా అప్పుడే మధుమేహం బారినపడిన 867 మంది 40-69 ఏళ్లవారి ఆరో గ్య వివరాలను ఐదేళ్లపాటు సేకరించి, పరిశీలించారు. వారిలో 257 మంది(30ు) రోజూ 700 కెలరీలకు మించకుండా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు ను 10ు మేర తగ్గించుకున్నట్లు గుర్తించారు. ఫలితం గా వారిలో మధుమేహం అదుపులోకి వచ్చినట్లు తేలిం ది. కాగా, గోధుమరంగు కొవ్వు కణజాలం నుంచి వెలువడే 12-హెచ్‌ఈపీఈ అణువులకు రక్తంలోని చక్కెర(షుగర్‌) స్థాయిని తగ్గించే శక్తి ఉందని బ్రెజిల్‌, అమెరికా శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో వెల్లడైంది.