నొప్పిని గుర్తించే భాగం.. చర్మంలో గుర్తింపు!

17-08-2019: నొప్పి కలిగిన వెంటనే గుర్తించే ఒక భాగం చర్మంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. గ్లియా కణాలతో పాటు పొడవుగా ఉండే తీగల్లాంటి ఆకారాలతో కూడిన ఈ భాగం, చర్మానికి స్వల్ప ప్రమాదం వాటిల్లినా వెంటనే మెదడుకు నొప్పి సంకేతాలు పంపిస్తుందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా సంస్థకు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఎంపిక చేసిన కొంతమందిలో ఈ భాగాన్ని తాత్కాలికంగా పనిచేయకుండా చేయగా.. వారికి నొప్పి తెలియలేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.