రాత్రిళ్లు మెలకువగా ఉండే బాలికలకు ఊబకాయం

17-09-2019: మీరు టీనేజ్‌ అమ్మాయా? రోజూ ఆలస్యంగా నిద్రపోతారా? అయితే, మీరు త్వరగా లావు అవుతారని ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. దీని వివరాలను జామా పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. దీని కోసం 11 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న 418 మంది బాలికలు, 386 మంది బాలురు పడుకునే సమయం, ఇతర అలవాట్లను పరిశోధకులు పరిశీలించారు. వారిలో రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం అలసటతో బాధపడే బాలికల బరువులో మార్పు వచ్చిందని వెల్లడించారు. ఒక్కగంట అలసట కారణంగా నడుము కొలత చదరపు మీటరుకు అత్యధికంగా 1.19 సెంటీమీటర్లు, బరువు 0.45 కిలోగ్రాముల చొప్పున పెరిగాయని తెలిపారు.