వాయు కాలుష్యంతో.. మానసిక సమస్యలు

22-08-2019: వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మీరు ఎక్కువగా తిరుగుతుంటారా? అయితే, మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు ఎక్కువ అవకాశం ఉందని చికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల తాము చేసిన సర్వేలో ఈ విషయంవెల్లడైందని తెలిపారు. గాలి కాలుష్యంలో తిరిగే వారిలో ఒత్తిడి పెరిగి, తద్వారా మానసిక రుగ్మతలు మొదలవుతున్నట్టు గుర్తించామన్నారు. పలు దేశాల్లోని కాలుష్య ప్రాంతాల్లో ఉండే కొంతమందిని తాము పరిశీలించామని, చిన్నతనంలో అలాంటి ప్రాంతాల్లో నివసించిన వారు పెద్దయ్యాక రకరకాల మానసిక సమస్యల బారిన పడ్డారని తెలిపారు.