మానసిక ఆరోగ్యం బాగుండాలంటే....

24-08-2019: పౌష్ఠికాహారం ప్రభావం శారీరక ఆరోగ్యం మీదే కాదు మానసిక ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మగవాళ్ల కన్నా ఆడవాళ్ల మీదే ఎక్కువని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. ‘న్యూట్రిషనల్‌ న్యూరోసైన్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం చెబుతున్న వివరాలివి... మెదడు నిర్మాణ, పనితీరులో తేడా వల్ల మానసిక వ్యాధులు వచ్చే అవకాశముంది. మగవాళ్లు తక్కువ పోషకాలున్న ఆహరం తీసుకున్నప్పటికీ మానసికంగా చురుగ్గా ఉన్నారని, అదే మహిళలు మాత్రం పౌష్ఠికాహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబిస్తున్నప్పటికీ వారి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని కనుగొన్నారు. ఇలాజరగకుండా ఉండాలంటే మహిళలు పోషకాలున్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.