యాంటీబయాటిక్స్‌తో పేగు కేన్సర్‌!

25-08-2019: ఏ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చినా వెంటనే యాంటిబయాటిక్స్‌ వాడేస్తున్నారా? మీ సమాధానం అవును అయితే, అది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు బ్లూమ్‌బర్గ్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ను వినియోగించడం వల్ల పెద్ద పేగు కేన్సర్‌ వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీని కోసం 1989 నుంచి 2012 మధ్య పెద్ద పేగు కేన్సర్‌తో మరణించిన 28,890 మంది రిపోర్టులను పరిశీలించారు ధూమపానం, మద్యపానం, మధుమేహం వల్ల పేగు కేన్సర్‌ బారినపడిన వారితో సమానంగా యాంటీబయాటిక్స్‌ వినియోగించిన వారు కూడా ఉన్నారని చెప్పారు. వాటిని అధికంగా వినియోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపారు.