త్వరగా యవ్వనదశకొస్తే.. ఎముకల్లో సాంద్రత తక్కువ!

13-08-2019: మన శరీరంలో ఎముకల బలానికి, యవ్వన దశకు సంబంధం ఉండొచ్చంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. యుక్తవయసులోకి త్వరగా వచ్చినవారికి, తర్వాతి కాలంలో ఎముకల్లో సాంద్రత తగ్గిపోతోందని సీనియర్‌ పరిశోధకులు డాక్టర్‌ అహ్మద్‌ ఇల్‌హకీమ్‌ వెల్లడించారు. ఇందుకోసం పది నుంచి పాతికేళ్ల వయసున్న 6,389 మందిపై ఆరు దశల్లో పరిశోధన చేశామని ఆయన తెలిపారు.