రెడ్‌ మీట్‌ తగ్గిస్తే..గుండెజబ్బులు తగ్గుముఖం

02-10-2019: రెడ్‌ మీట్‌ తినడం ఎంత తగ్గిస్తే.. గుండెజబ్బులు వచ్చే అవకాశాలు అంత తగ్గుతాయని బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. గొడ్డు, మేక, పంది మాంసాలు(రెడ్‌ మీట్‌) బాగా తినేవారి ధమనుల్లో చెడు కొలెస్టరాల్‌ పేరుకుపోయి, గుండె జబ్బులకు దారితీయవచ్చని వారు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసిన 46 మంది 12 వారాలపాటు రెడ్‌ మీట్‌ వాడకాన్ని సగానికి సగం తగ్గించేలా పర్యవేక్షించారు. అనంతరం జరిపిన వైద్యపరీక్షల్లో వారిలో చెడు కొలెస్టరాల్‌ సగటున 10 శాతం మేర తగ్గడాన్ని గుర్తించారు.