గుండెజబ్బు రోగులకు స్వల్ప కసరత్తులూ మేలే!

ఆంధ్రజ్యోతి(24-10-2016): సాధారణ ఆరోగ్యవంతులు చేసే స్వల్పస్థాయి వ్యాయామం కన్నా.. గుండెజబ్బు రోగులు 20 శాతం తక్కువగా వ్యాయామం చే స్తే మంచి ఫలితం ఉంటుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంట్రియెల్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ గుండెజబ్బులు ఉన్న 205 మంది పురుషులు, 44 మంది సీ్త్రలపై పరిశోధించిన వారు.. ఎక్సర్‌సైజుల వల్ల వారిపై పడుతున్న ఒత్తిడిని అంచనా వేశారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారం.. వారానికి 150 నిమిషాలు మధ్యస్థాయిలో లేదా 75 నిమిషాలు కాస్త శ్రమతో కూడుకున్న వ్యాయామం చేస్తే మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు ముప్పు తగ్గుతాయని తెలిపారు. అయితే, ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టే ముందు తప్పనిసరిగా వైద్యుల సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు.