పగటి నిద్రతో మతిమరుపు!

14-08-2019: మీరు పగటిపూట ఎక్కువ సమయం పడుకుంటారా? మీ సమాధానం అవును అయితే అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు (అల్జీమర్స్‌) వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనల్ని నిద్రపోకుండా ఉంచే మెదడులోని భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పగలు ఎక్కువగా నిద్రపోయే వారిలో తీసుకున్న ప్రొటీన్లు మెదడుకు చేరడం లేదని గుర్తించారు. ఫలితంగా మనల్ని మెలకువతో ఉంచే నాడీకణాలు చనిపోతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జోసెఫ్‌ వెల్లడించారు. అంతిమంగా ఇది అల్జీమర్స్‌కు దారి తీస్తోందన్నారు.