శీతల పానీయాలతో కాలేయానికి కొవ్వు ముప్పు

03-10-2019: ఫ్రక్టోస్‌ అధికంగా ఉండే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కాలేయం పనితీరుపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక ఫ్రక్టోస్‌ వల్ల కాలేయంలో కొవ్వును కరిగించే మైటోకాండ్రియాలు పాడవుతాయని, ఫలితంగా కొవ్వు పేరుకుపోతుందని చెప్పారు. ఇది శరీర జీవక్రియపై ప్రభావం చూపుతుందన్నారు. కాగా, కొవ్వును కరిగించడంలో గ్లూకోజ్‌ పాత్ర మెరుగైనదని చెప్పారు. గ్లూకోజ్‌, ఫ్రక్టో్‌సలు సమాన స్థాయిలో కేలరీలు కలిగి ఉన్నప్పటికీ ఫ్రక్టోస్‌ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ముప్పని చెప్పారు.