సూక్ష్మస్థాయిలో త్రీడీ ఫొటోలు తీసే ఎండోస్కోప్‌

17-08-2019: కణం కంటే చిన్నగా ఉండేవాటిని కూడా త్రీడీలో ఫొటో తీయగల అతి చిన్న ఎండోస్కో్‌పను జర్మనీలోని డ్రెస్డెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఫొటో తీసేందుకు ఎలాంటి లెన్స్‌ కానీ, యాంత్రిక సహకారం కానీ ఈ పరికరం తీసుకోకపోవడం గమనార్హం. కణజాల పనితీరులో ఉద్దీపన కలిగించే ఆప్టోజెనెటిక్స్‌లో ఇది విశేషంగా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.