చిత్తవైకల్యం ఎమ్‌ఆర్‌ఐతో గుర్తింపు!

15-09-2019: బ్రెయిన్‌ స్ట్రోక్‌ వల్ల వచ్చే చిత్తవైకల్యాన్ని అత్యాధునిక ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌తో ముందుగానే గుర్తించవచ్చని అమెరికాలోని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎక్కువసేపు ఆలోచించడం వల్ల మెదడులోని చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయని, దాని వల్ల చిత్తవైకల్యం వస్తుందని తెలిపారు. దీని కోసం ఎక్కువగా ఆలోచించే కొంతమందిని మూడేళ్లపాటు పరీశీలించామని సీనియర్‌ పరిశోధకులు రెబెక్క చార్ల్‌టన్‌ చెప్పారు. వారిలో కొందరి మెదళ్లలో మార్పులు గమనించామన్నారు. మార్పులు వచ్చిన వారు కొంతకాలానికి చిత్తవైకల్యం బారిన పడ్డారని తెలిపారు. క్రమం తప్పకుండా స్కానింగ్‌ చేయిస్తే.. స్ట్రోక్‌ వల్ల వచ్చే చిత్తవైకల్యాన్ని ముందే గుర్తించవచ్చని చెప్పారు.