పీటీఎస్‌డీ చికిత్సతో టైప్‌2 డయాబెటి్‌సకు చెక్‌

24-08-2019: అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు.. చూడరాని ఘోరాన్ని చూడాల్సి వచ్చినప్పుడు కలిగిన భయాందోళనలు మనసులో గూడుకట్టుకొని ఏర్పడేదే పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌(పీటీఎ్‌సడీ). ఇది కలిగిన వారిలో చాలా సందర్భాల్లో మానసిక ఆందోళన, ఒత్తిళ్లు, ఉద్వేగాలు అదుపులో పెట్టుకోలేనంతగా ఉంటాయి. ఫలితంగా పీటీఎ్‌సడీ బాధితులు సులువుగా డయాబెటిస్‌, ఒబెసిటీ సంబంధ వ్యాధుల బారినపడుతుంటారు. దీనికి సంబంధించిన చికిత్సపొందుతున్న వారిలో టైప్‌2 డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈవివరాలు ఇటీవల ‘జామా సైకియాట్రీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.