శీతల పానీయాలతో కేన్సర్‌!

12-07-2019: చక్కెర ఉండే శీతల పానీయాలు అధికంగా తీసుకునే వారికి కేన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువని తాజా సర్వే హెచ్చరిస్తోంది. శీతల పానీయాలు అదేపనిగా తీసుకునేవారికి ఊబకాయంతోపాటు తర్వాతి కాలంలో ప్రమాదకరమైన కేన్సర్‌ వస్తున్నట్లు వర్సిటీ ఆఫ్‌ ప్యారిస్‌ పరిశోధకులు అధ్యయనంలో గుర్తించారు. బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌, పేగు కేన్సర్‌లకు ఈ అలవాటే ఎక్కువగా కారణమని చెబుతున్నారు.