ఫ్లేవనాయిడ్స్‌తో కేన్సర్‌, గుండెజబ్బులు దూరం

18-08-2019: ప్రకృతిపరంగా లభించే ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉండే టీ, యాపిల్‌ వంటి ఆహారాల్ని తీసుకుంటే కేన్సర్‌, గుండె జబ్బులు దూరంగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా ధూమపాన, మద్యపాన ప్రియులకు ఇవి అత్యవసరమని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని ఎడిత్‌ కొవాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు డా. నికోలా బోన్‌డోనో వెల్లడించారు. ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ బాగున్నట్లు తమ పరిశోధనల్లో గమనించామని ఆమె తెలిపారు.