ఇంట్లోనే ఫేషియల్‌..!

05-09-2019: కాలుష్యం, మొటిమలు... కారణం ఏదైనా ముఖం మీద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని పోగొట్టే ‘ఆలూ బ్యూటీ ఫేషియల్‌’ ఇంట్లోనే చేసుకోవచ్చు. అదెలాగంటే....
 
క్లీన్సింగ్‌ కోసం: బంగాళాదుంప ముక్కలు మిక్సీ వేసి రసం తీసి 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఈ రసంలో దూది ఉండను ముంచి ముఖమంతా అద్దుకోవాలి.
తర్వాత రెండు నిమిషాలు అలాగే వదిలేసి, శుభ్రంగా కడుక్కోవాలి.
ఫేస్‌ మాస్క్‌ కోసం: నాలుగు టీ స్పూన్ల బంగాళాదుంప రసం
రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి
తగినన్ని రోజ్‌ వాటర్‌
ఈ మూడింటిని కలిపి ముఖానికి పట్టించాలి.
అరగంట తర్వాత ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి.