చర్మం మెరుస్తుందిలా...

01-08-2019: జిడ్డు, పొడి, మృదువైన చర్మం.. ఇలా చర్మతత్వం ఏదైనా బాదం నూనె సౌందర్య సాధనంగా పనికొస్తుంది. ఇంతకీ అది ఎలా పనిచేస్తుందంటే.. నానబెట్టిన బాదం: బాదం గింజల్లో విటమిన్‌ ఇ అధికంగా ఉంటుంది. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను పునరుద్ధరించి, చర్మానికి నిగారింపునిస్తుంది. అంతేకాదు చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
 
బాదం నూనె: సువాసనతో కూడిన బాదం నూనె వెంట్రుకలకు పోషణనిస్తుందని తెలుసు. దీంతో పాటు చర్మాన్నీ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముఖ కాంతిని పెంచుతుంది. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు బాదం నూనెలో కొన్ని నీళ్ల చుక్కలు వేసి, ముఖానికి రాసుకోవాలి.
 
బాదం ఫేస్‌ప్యాక్‌: బాదం నూనెలో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. తేనె చర్మానికి సాంత్వననిస్తుంది. నిమ్మరసంలోని
విటమిన్‌ సి మలినాలను తొలగిస్తుంది.
 
వెన్న, బాదం నూనె: రెండు టేబుల్‌ స్పూన్ల వెన్న, టేబుల్‌ స్పూను బాదం నూనె మిశ్రమాన్ని చేతులకు రాసుకుని పది నిమిషాలయ్యాక వేడినీళ్లతో కడుక్కోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.