ఇదో రకం ఫేస్‌ప్యాక్‌

09-07-2019: బియ్యం కడిగి లేదా గంజి వార్చి ఆ నీటిని పారబోస్తాం. ఆ నీటిలో చర్మ, కేశ సౌందర్యాన్ని పెంచేవిటమిన్లు, లవణాలు మెండుగా ఉంటాయి. సౌందర్య ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని బియ్యం నీళ్లతో అందాన్ని పెంచుకోవడం ఎలాగో చూద్దాం.
బియ్యం నీళ్లలోని ఫెరూలిక్‌ యాంటీ ఆక్సిడెంట్‌ చర్మానికి పోషణనిస్తుంది. అల్లాటోనిన్‌ పదార్థం దురదను పోగొట్టి,
చర్మానికి సాంత్వననిస్తుంది. బియ్యం నీళ్లలో ముంచిన కాటన్‌ ప్యాడ్‌తో ముఖం మీద రుద్దుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడుక్కోవాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే చర్మం
సున్నితంగా మారుతుంది.
ఈ నీరు ముఖం మీది ఎర్రటి మచ్చలను తొలగించి, ముఖానికి తాజాదనాన్ని, నిగారింపును ఇస్తుంది.
బియ్యం నీళ్లను వెంట్రుకలకు పట్టిస్తే, అవి దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. షాంపూ లేదా కండీషనర్‌ వాడిన తరువాత బియ్యం నీళ్లతో కురులను తడుపుకొని, ఆరాక నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ నీళ్లలోని అయనోసిటాల్‌ అనే కార్బోహైడ్రేట్‌ శిరోజాలను పొడిబారకుండా చూసి, మెరుపునిస్తుంది. అంతేకాదు కుదుళ్లలోని సహజ నూనెలు తొలగిపోకుండా, పీహెచ్‌ స్థాయులు మారకుండా చూస్తుంది.