ఇంట్లోనే ‘స్పా’ మెరుపులు!

19-10-2019: స్కిన్‌ అందంగా, తాజాగా కనిపించేందుకు పార్లర్‌ లేదా స్పాకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ బ్రష్‌తో చర్మాన్ని చర్మాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు. ఇంకేం ఇంటి వద్దనే బాడీ బ్రషింగ్‌ చేసుకోండిలా...

 
బాడీ బ్రష్‌ పొడిగా ఉండాలి. బ్రష్‌ను సలువుగా కదిలించేలా పట్టుకొని వలయాకారంలో నెమ్మదిగా కదిలిస్తూ పాదాలా నుంచి మెడ వరకూ బాడీ బ్రషింగ్‌ చేసుకోవాలి. గాయాలు, దద్దుర్లు ఉన్న చోట బ్రషింగ్‌ చేయకూడదు.
ముఖానికి మృదువైన బ్రిస్టిల్స్‌ ఉన్న డ్రై బ్రష్‌ ఎంచుకోవాలి. లేదంటే స్క్రబ్బర్‌ ఉపయోగించినా సరే.
ఒళ్లంతా బ్రషింగ్‌ పూర్తయ్యాక స్నానం చేయాలి. గోరువెచ్చని నీళ్లతో మొదలెట్టి, మరికొంచెం వేడినీళ్లతో స్నానం చేయాలి. దీంతో చర్మం మీది మృతకణాలన్ని పూర్తిగా తొలగిపోతాయి.
స్నానం అయ్యాక ప్రొటీన్లతో కూడిన మాయిశ్చరైజర్‌ ఒంటికి రాసుకోవాలి. కొద్దిసేపు రిలాక్స్‌ కావాలి.
డ్రై బ్రషింగ్‌ వల్ల లాభాలివి...
మృత కణాలు, చర్మం మీది మలినాలు తొలగిపోతాయి. మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. దాంతో చర్మం తాజాగా, అందంగా కనిపిస్తుంది.
చర్మ కణాలకు రక్తప్రసరణ పెరగుతుంది. స్కిన్‌ మృదువుగా, సహజ కాంతితో మెరిసిపోతుంది.
వారంలో రెండు సార్లు ఇలాచేస్తే తాజా మేని ఛాయను సొంతం చేసుకోవచ్చు.